logo

రైల్వేలైను వద్దు.. భూములు తీసుకోవద్దు

విశాఖ-రాయపూర్‌ మార్గంలో మూడో రైల్వేలైను నిర్మాణానికి జామి ప్రాంతంలో భూములను సేకరించొద్దని, వెంటనే సర్వేను నిలిపివేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. సోమవారం జడ్పీటీసీ మాజీ సభ్యుడు బండారు పెదబాబు ఆధ్వర్యంలో రైతులు తహసీల్దారు

Published : 24 May 2022 05:14 IST


జామి తహసీల్దారు కార్యాలయం వద్ద నినాదాలు చేస్తున్న రైతులు

జామి, న్యూస్‌టుడే: విశాఖ-రాయపూర్‌ మార్గంలో మూడో రైల్వేలైను నిర్మాణానికి జామి ప్రాంతంలో భూములను సేకరించొద్దని, వెంటనే సర్వేను నిలిపివేయాలంటూ బాధితులు ఆందోళనకు దిగారు. సోమవారం జడ్పీటీసీ మాజీ సభ్యుడు బండారు పెదబాబు ఆధ్వర్యంలో రైతులు తహసీల్దారు కార్యాలయం వద్దకు చేరుకొని ధర్నా చేశారు. ప్రస్తుతం సర్వే చేస్తున్న భూములన్నీ సన్న చిన్నకారు రైతులవని, వీటిని తీసుకుంటే జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే లైను వద్దు.. భూములు ఇచ్చేది లేదంటూ నినాదాలు చేశారు. అనంతరం ఉప  తహసీల్దారు సునీతకు వినతిపత్రం అందజేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని