logo

పుట్టడం మానేస్తున్నావా.. తల్లీ !

సృష్టికి మూలం స్త్రీ. కానీ ఆడపిల్లల పుట్టుకలో జిల్లాలో తగ్గుదల కన్పిస్తోంది. గత నాలుగేళ్లుగా గణాంకాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. లింగ నిర్ధారణ నేరమన్నా.. ఆచరణలోకి రావడం లేదు. స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా లేకపోవడం, గర్భం దాల్చిన మహిళ

Published : 24 May 2022 05:14 IST

 ఏటేటా తగ్గుతున్న ఆడపిల్లల జననాలు 


జామి పీహెచ్‌సీలో గర్భిణులకు వైద్య పరీక్షలు

గర్భిణుల సుఖ ప్రసవాల కోసం రాణి అప్పల కొండమాంబ తన సొంత నిధులతో విజయనగరంలో ఘోష ఆసుపత్రిని కట్టించారు. ఆడ పిల్లలు చదువుకుని ప్రయోజకులు కావాలని విజయనగరం రాజులు తమ కోటనే కళాశాలగా మార్చేశారు. జిల్లాలో     అబలకు ఇంతలా పెద్దపీట వేస్తున్నా.. ఆడపిల్లల జననాల సంఖ్య తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

విజయనగరం వైద్య విభాగం, న్యూస్‌టుడే  సృష్టికి మూలం స్త్రీ. కానీ ఆడపిల్లల పుట్టుకలో జిల్లాలో తగ్గుదల కన్పిస్తోంది. గత నాలుగేళ్లుగా గణాంకాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. లింగ నిర్ధారణ నేరమన్నా.. ఆచరణలోకి రావడం లేదు. స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా లేకపోవడం, గర్భం దాల్చిన మహిళ ఏ బిడ్డకు జన్మనిచ్చింది? మధ్యలో గర్భం పోతే కారణాలేమిటి..?, ఒకవేళ పాప పుడితే ఆ బిడ్డ పరిస్థితి ఏమిటి..? అనే విషయాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం కూడా కారణమే. ఓ తల్లికి ఎవరు పుడతారనేది ఎవరికీ తెలియదు. ఇది జన్యుపరమైన ప్రక్రియ. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్ల పుడితే నువ్వు నీ పుట్టింటికి పోవాల్సిందేనని.. లేకుంటే కొడుక్కి మరో పెళ్లి చేస్తానని అత్తింటివారు వేధిస్తున్న ఘటనలు లేకపోలేదు. వీటిపై పోలీస్‌స్టేషన్లలో కేసులు దాఖలవుతూనే ఉన్నాయి.

అవగాహన పెంచాలి 
గర్భస్థ లింగ నిర్ధారణకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి. స్కానింగ్‌ కేంద్రాలపై నిఘా పెంచాలి. ప్రోత్సహించే వైద్యులపై చర్యలు తీసుకుంటామని ఐఎంఏ సైతం ప్రకటించాలి. ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. కొంతమంది వారి ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి.  - కేసలి అప్పారావు,  ఛైర్మన్, రాష్ట్ర బాలల హక్కుల  పరిరక్షణ కమిషన్‌. 

సమాచారం చెబితే బహుమతులు .....
గర్భస్థ లింగ నిర్ధారణ నేరం. ఇటువంటివి ప్రోత్సహిస్తే చర్యలు తీసుకుంటాం. అలాంటి వ్యక్తులు గానీ, కేంద్రాలు గానీ ఉంటే మాకు సమాచారం ఇస్తే ప్రోత్సాహక బహుమతులు ఇస్తాం. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. క్షేత్రస్థాయిలో గర్భిణుల కదలికలు, వారి ఆరోగ్య పరిస్థితిపై మా బృందాలు నిఘా ఉంచాయి. గతంతో పోలిస్తే బాలికల జననం చాలా వరకు మెరుగుపడింది. - ఎస్‌వీ రమణకుమారి, డీఎంహెచ్‌వో  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని