logo

తాటిపూడికి జలకళ

అరకు, అనంతగిరి కొండల్లో కురుస్తున్న వర్షాలతో తాటిపూడికి వరదనీరు పోటెత్తుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 297 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 295.90 అడుగులు నమోదైనట్లు ప్రాజెక్టు ఏఈ

Updated : 07 Aug 2022 05:33 IST

తాటిపూడి (గంట్యాడ), న్యూస్‌టుడే: అరకు, అనంతగిరి కొండల్లో కురుస్తున్న వర్షాలతో తాటిపూడికి వరదనీరు పోటెత్తుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 297 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 295.90 అడుగులు నమోదైనట్లు ప్రాజెక్టు ఏఈ వి.తమ్మునాయుడు తెలిపారు. 897 క్యూసెక్కుల వరద వస్తోందని, సుమారు 170 క్యూసెక్కుల సాగునీటిని కాలువల ద్వారా విడిచిపెడుతున్నామన్నారు. 296 అడుగులు దాటిన తర్వాత ఉన్నతాధికారుల అనుమతితో జలాశయం దిగువ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి నీటిని విడుదల చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని