logo

ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం వాతావరణ విభాగం శాస్త్రవేత్త డా.ఎస్‌.స్రవంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 05 Oct 2022 03:43 IST

కురుపాం/గ్రామీణం, న్యూస్‌టుడే: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం వాతావరణ విభాగం శాస్త్రవేత్త డా.ఎస్‌.స్రవంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5న 60 మి.మీ, 6న 47 మి.మీ, 7న 20 మి.మీ, 8న 38 మి.మీ, 9న 40 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పంట పొలాల్లో పురుగు, కలుపు మందులు పిచికారీ చేయాల్సిన రైతులు వాయిదా వేసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని