logo

వేటకు వెళ్లొద్దు

అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఉదయం నుంచి భోగాపురం, పూసపాటిరేగలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని, ఒడ్డున ఉన్న పడవలను వెనక్కి తీసుకురావాలని మత్స్య శాఖ డీడీ నిర్మలాకుమారి సూచించారు.

Published : 05 Oct 2022 04:18 IST

 

ముక్కాంలో ముందుకొచ్చిన సముద్రం

భోగాపురం/పూసపాటిరేగ, న్యూస్‌టుడే: అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఉదయం నుంచి భోగాపురం, పూసపాటిరేగలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని, ఒడ్డున ఉన్న పడవలను వెనక్కి తీసుకురావాలని మత్స్య శాఖ డీడీ నిర్మలాకుమారి సూచించారు. కెరటాలు ముందుకు రావడంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంటోంది.

ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన
కురుపాం/గ్రామీణం, న్యూస్‌టుడే: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రస్తాకుంటుబాయి కృషి విజ్ఞానకేంద్రం వాతావరణ విభాగం శాస్త్రవేత్త డా.ఎస్‌.స్రవంతి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 5న 60 మి.మీ, 6న 47 మి.మీ, 7న 20 మి.మీ, 8న 38 మి.మీ, 9న 40 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పంట పొలాల్లో పురుగు, కలుపు మందులు పిచికారీ చేయాల్సిన రైతులు వాయిదా వేసుకోవాలని సూచించారు.
నాగావళి తీర గ్రామాల్లో అప్రమత్తం
సంతకవిటి, న్యూస్‌టుడే: వాతావరణ శాఖ హెచ్చరికలతో తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టుల అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయాల నుంచి నీటిని నాగావళిలోకి విడుదల చేస్తుండటంతో నదిలో ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. భారీ వర్షాలు కురిస్తే వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున తీర గ్రామాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు సులోచనరాణి హెచ్చరించారు. ప్రవాహ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని వీఆర్వోలు, వీఆర్యేలను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని