logo

గ్రామ కంఠాలపై శాశ్వత హక్కుకు సర్వే

జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా గ్రామ కంఠాల్లోని ఆస్తుల గుర్తింపునకు సర్వే చేసి, వాటిని అనుభవిస్తున్న వారికి హక్కులు కల్పించాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ, సర్వే, భూరికార్డుల అధికారి కె.రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 26 Nov 2022 02:13 IST

పార్వతీపురం, న్యూస్‌టుడే: జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా గ్రామ కంఠాల్లోని ఆస్తుల గుర్తింపునకు సర్వే చేసి, వాటిని అనుభవిస్తున్న వారికి హక్కులు కల్పించాలని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బి.సత్యనారాయణ, సర్వే, భూరికార్డుల అధికారి కె.రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఐటీడీఏ గిరిమిత్ర సమావేశ మందిరంలో సచివాలయ సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, ఇంజినీరింగ్‌, డిజిటల్‌ సహాయకులకు గ్రామ కంఠాల సర్వేపై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ముందుగా జేసీ ఆనంద్‌, పాలకొండ సబ్‌కలెక్టర్‌ నూరుల్‌కమర్‌ సూచనలు చేశారు. తగాదాలు లేకుండా సర్వే పూర్తి చేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని