logo

విభిన్న ప్రతిభ గొప్ప వరం

విభిన్న ప్రతిభావంతులకు ఉండే నైపుణ్యాలు వారికి గొప్ప వరమని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు.

Published : 26 Nov 2022 02:38 IST

షాట్‌ఫుట్‌ పోటీలను తిలకిస్తున్న జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు

విజయనగరం క్రీడలు, న్యూస్‌టుడే: విభిన్న ప్రతిభావంతులకు ఉండే నైపుణ్యాలు వారికి గొప్ప వరమని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. డిసెంబరు 3న జరగనున్న విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాజీవ్‌ మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జీవితంలో ఎప్పుడూ వెనకడుగు వేయొద్దని, ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. అంతకుముందు జాతీయ జెండాను ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. జేసీ మయూర్‌అశోక్‌, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు జగదీష్‌, యువజన సర్వీసుల శాఖ సీఈవో బి.రామానందం, క్రీడాశాఖ ముఖ్య శిక్షకుడు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని