logo

నాడు ఆహ్లాదం.. నేడు అధ్వానం

పార్వతీపురం మండలంలోని నర్సిపురం గ్రామ ముఖద్వారం వద్దనున్న మంచినీటి కోనేరు పరిసరాల దుస్థితి ఇది.

Published : 26 Nov 2022 02:38 IST

ఉద్యానవనం ఆవరణలో పాడైన పరికరాలు

పార్వతీపురం మండలంలోని నర్సిపురం గ్రామ ముఖద్వారం వద్దనున్న మంచినీటి కోనేరు పరిసరాల దుస్థితి ఇది. గత ప్రభుత్వ హయాంలో నీరు- చెట్టు పథకం కింద సుమారు రూ.20 లక్షలు వెచ్చించి గట్టు చుట్టూ మొక్కలు నాటారు. గాంధీ, వివేకానందుడి విగ్రహాలు ఆవిష్కరించారు. సేదదీరేందుకు బెంచీలు, చిన్నారుల కోసం ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. చెరువు సుందరీకరణను చూసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గ్రామస్థులను మెచ్చుకున్నారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు అదనంగా రూ.20 లక్షలు అందజేశారు. గతంలో సంక్రాంతి సంబరాలను సైతం ఇక్కడే నిర్వహించేవారు. అలాంటి చెరువు ప్రస్తుతం అధ్వానంగా మారింది. మందు సీసాలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలతో దర్శనమిస్తోంది. దీంతో చిన్నారులు, పెద్దలు అటువైపు వెళ్లడమే మావేశారు. దీనిపై కార్యదర్శి ఎం.జగన్‌ మాట్లాడుతూ.. పరిశీలించి, త్వరలో శుభ్రం చేస్తామన్నారు. సెక్యూరిటీని నియమించేందుకు, నిధుల కోసం ప్రతిపాదనలు పంపించామని, రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.

న్యూస్‌టుడే, బెలగాం, పార్వతీపురం గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని