logo

స్వేచ్ఛ, సమానత్వానికి అంబేడ్కర్‌ కృషి

దేశప్రజల స్వేచ్ఛ, సమానత్వానికి అంబేడ్కర్‌ ఎనలేని కృషి చేశారని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ అన్నారు.

Published : 27 Nov 2022 03:56 IST

ర్యాలీలో పాల్గొన్న ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌, నాయకులు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: దేశప్రజల స్వేచ్ఛ, సమానత్వానికి అంబేడ్కర్‌ ఎనలేని కృషి చేశారని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ మారుమూడి విక్టర్‌ ప్రసాద్‌ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమతా సైనిక్‌ దళ్‌ ఆధ్వర్యంలో చీపురుపల్లిలో నీలి కవాత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు.ఉత్తరాంధ్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీల అభ్యున్నతికి రిజర్వేషన్లు కల్పించారని, మహిళల ఉద్ధరణకు కృషి చేశారని చెప్పారు. ఆర్డీవో ఎం.అప్పారావు, మత్స్య శాఖ డీడీ నిర్మలాకుమారి, రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ సభ్యురాలు జయమణి, సమతా సైనిక్‌ దళ్‌ దక్షిణ భారత ఉపాధ్యక్షుడు రేంజర్ల రాజేష్‌, రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సిమ్మాల దుర్గాప్రసాద్‌, ఉత్తరాంధ్ర సలహాదారు కింతాడ రవి విజయప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని