logo

మెంటాడకు ఆండ్ర ఠాణా తరలింపు: ఎస్పీ

ఆండ్ర పోలీస్‌స్టేషన్‌ను మెంటాడకు తరలించాలని పలువురి నుంచి ప్రతిపాదనలు రావడంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ పేర్కొన్నారు.

Published : 27 Nov 2022 03:56 IST

మెంటాడ, న్యూస్‌టుడే: ఆండ్ర పోలీస్‌స్టేషన్‌ను మెంటాడకు తరలించాలని పలువురి నుంచి ప్రతిపాదనలు రావడంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ పేర్కొన్నారు. శనివారం ఆండ్ర స్టేషన్‌ను పరిశీలించిన ఆమె వివరాలు వెల్లడించారు. మెంటాడలో ఠాణా ఏర్పాటుకు అవసరమైన భవనం కేటాయిస్తే ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించి చర్యలు తీసుకుంటామన్నారు. గతేడాది మెంటాడ మీదుగా గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరిగేదని, పిట్టాడ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి నియంత్రించామన్నారు. ఈ ప్రాంతంలో అదనంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తామన్నారు. ఆపదలో ఉన్న వారి కోసం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. బొబ్బిలి డీఎస్పీ మోహనరావు, ఆండ్ర ఎస్సై సిద్ధార్థకుమార్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని