logo

జీతం రాక.. జీవనం సాగక

ఆర్టీసీ ప్రభుత్వంలోకి విలీనం అయినా కార్మికులకు అవస్థలు తప్పడం లేదు. గతంలో కార్పొరేషన్‌లో ఉన్నప్పుడు అనారోగ్యంతో సెలవు పెట్టినా సగం జీతం అందేది.

Updated : 29 Nov 2022 03:38 IST

ఆర్టీసీ కార్మికులకు తప్పని అవస్థలు

ఆర్టీసీ డీఎం భాస్కర్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

సాలూరు, న్యూస్‌టుడే: ఆర్టీసీ ప్రభుత్వంలోకి విలీనం అయినా కార్మికులకు అవస్థలు తప్పడం లేదు. గతంలో కార్పొరేషన్‌లో ఉన్నప్పుడు అనారోగ్యంతో సెలవు పెట్టినా సగం జీతం అందేది. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. సాలూరు డిపో పరిధిలోని పలువురు పక్షవాతం, గుండె, కిడ్నీ, వెన్నెముక సంబంధిత వ్యాధులకు గురై మంచాన పడ్డారు. వీరికి నెలలుగా జీతాల చెల్లింపులు జరగక పోవడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. డిపోలో పనిచేస్తున్న 14 మంది ఉద్యోగులు ఈ మేరకు సోమవారం ప్రబంధకుడు భాస్కర్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆదుకోవాలని విన్నవించారు. దీనిపై డీఎం మాట్లాడుతూ ప్రస్తుతం ఖజానా ద్వారా జీతాలు చెల్లిస్తున్నారని, తమ పరిధిలో లేదన్నారు. సిక్‌ లీవ్‌లో ఉన్నవారికి సకాలంలో సగం వేతనం వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

 మూడు నెలలుగా ఇవ్వలేదు..

మంచం పట్టిన ఈ కార్మికుడి పేరు వి.శ్రీనివాసరావు. పక్షవాతంతో బాధపడుతూ ఆరు నెలలుగా సెలవులో ఉన్నారు. గత మూడు మాసాలుగా నెలనెలా అందాల్సిన సగం జీతం రావడం లేదు. దీంతో ఇంట్లో సరకులు కూడా కొనుగోలు చేయలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సెలవు పెట్టినా హాజరు వేయాలట?

నేను రెండు నెలలుగా అనారోగ్య కారణాలతో ఇంటి వద్దే ఉన్నాను. గతంలో సిక్‌ లీవ్‌లు పెడితే సగం జీతం వచ్చేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సెలవు పెడితే హాజరు వేయాలని డిమాండు చేస్తున్నారు. చాలామంది లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారెలా హాజరు

జి.త్రినాథ, బస్సు చోదకుడు, సాలూరు డిపో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు