logo

ఎవరిదీ ఉద్యానం ఉసురు

శృంగవరపుకోటలోని గాంధీ పార్కు దుస్థితి ఇది. విరిగిన బెంచీలు, పశువులు, వ్యర్థాలతో దర్శనమిస్తోంది.

Published : 29 Nov 2022 03:13 IST

పార్కులో విరిగిన బెంచీలు

శృంగవరపుకోటలోని గాంధీ పార్కు దుస్థితి ఇది. విరిగిన బెంచీలు, పశువులు, వ్యర్థాలతో దర్శనమిస్తోంది. 2014లో ఉడా ఛైర్మన్‌ ఎస్‌.కోట పర్యటనలో భాగంగా దీని అభివృద్ధికి రూ.5 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో లోపల నడక మార్గం, ప్రధాన ద్వారం, గేటు తదితర పనులు చేశారు. అనంతరం నిర్వహణ గాలికొదిలేశారు. మూడేళ్లుగా సంబంధిత అధికారులు పట్టించుకోవడం మానేశారు. దీంతో సిమెంటు బెంచీలు ధ్వంసమయ్యాయి. పెద్దఎత్తున తుప్పలు పెరిగాయి. ప్రధాన ద్వారం పక్కనున్న గేటు ప్రాంతాన్ని కొందరు ఆక్రమించడంతో లోపలికి వెళ్లేందుకు అవస్థలు తప్పడం లేదు. పశువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. పట్టణంలో సేదదీరేందుకు ఇదొక్కటే ప్రధాన పార్కు. దీంతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ ఓ వాచ్‌మెన్‌ కూడా ఉన్నారు. అయితే అతన్ని వేరే పనులకు వినియోగిస్తున్నారు. దీనిపై పంచాయతీ ఈవో బీవీజే.పాత్రోను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా పంచాయతీ సమావేశంలో ప్రతిపాదనలు పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు.

న్యూస్‌టుడే, ఎస్‌.కోట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని