logo

పది గ్రామాలకు బస్సు

పాలకొండ మండల కేంద్రానికి శివారునున్న గ్రామీణ ప్రాంత విద్యార్థుల రవాణా కష్టాలు ఎట్టకేలకు తొలగాయి.

Published : 29 Nov 2022 03:13 IST

పాలకొండ మండల కేంద్రానికి శివారునున్న గ్రామీణ ప్రాంత విద్యార్థుల రవాణా కష్టాలు ఎట్టకేలకు తొలగాయి. ఆయా ప్రాంతాలమీదుగా బస్సు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో పాలకొండ నుంచి ఎం.సింగుపురం గ్రామానికి ఆర్టీసీ సర్వీసు నడిచేది. ఏడాది క్రితం దీన్ని రద్దు చేశారు. దీంతో ఎం.సింగుపురం, పొట్లి, బడ్డుమాసింగి, జంపరకోట, ఆర్‌బీఆర్‌.పేట, నవగాం, మల్లివీడు, అవలంగి, వంతవాడ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆటోలు, సైకిళ్లతో పట్టణానికి రాకపోకలు సాగించేవారు. ఈ సమస్యపై ‘ఈనాడు’లో ఈనెల 17న ‘విద్యార్థుల పాట్లు’ శీర్షికన ప్రచురితమైన వార్తకు డిపో మేనేజర్‌ ఎం.వెంకటేశ్వరరావు స్పందించారు. బస్సును పునరుద్ధరించామని, రోజూ మూడు సార్లు తిరుగుతుందని చెప్పారు.

న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని