logo

చిరుధాన్యాల సాగుతో మహిళలకు లబ్ధి

ఎల్‌.కోట మండలంలోని చిరు ధాన్యాల చెల్లెళ్ల సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను స్వాలోస్‌ ఇండియా సంస్థ పరిశీలించింది.

Updated : 29 Nov 2022 07:01 IST

మహిళలతో మాట్లాడుతున్న స్వాలోస్‌ సంస్థ సభ్యులు

లక్కవరపుకోట, న్యూస్‌టుడే: ఎల్‌.కోట మండలంలోని చిరు ధాన్యాల చెల్లెళ్ల సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలను స్వాలోస్‌ ఇండియా సంస్థ పరిశీలించింది. సంస్థ సభ్యురాలు అనిత, కార్యనిర్వాహక డైరెక్టర్‌ అలెగ్జాండ్రియా, ప్రోగ్రామ్‌ అధికారి సోఫియా సోమవారం రేగ గ్రామంలో పర్యటించారు. వీరికి సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి కె.సరస్వతి స్థానిక పరిస్థితులను వివరించారు. స్థానికంగా నిర్మాణంలో ఉన్న చిరుధాన్యాల యూనిట్‌ను వారు పరిశీలించారు. వివిధ గ్రామాల్లో సబల సంస్థ ఆధ్వర్యంలో చిరు ధాన్యాల సాగుకు చేపడుతున్న పనులను వారు తెలుసుకున్నారు. సాగుతో మహిళలు పొందుతున్న లాభాలు, జీవనోపాధులు, ఆరోగ్య, ఆహార, పర్యావరణ భద్రతల ఉపయోగాలపై మహిళలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సబల సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని