logo

సున్నా వడ్డీ లబ్ధి రూ.10.49 కోట్లు

జిల్లాలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 60,033 మంది రైతులకు రూ.10.491 కోట్లు, పెట్టుబడి రాయితీ సొమ్ము కింద 506 మందికి రూ.17.91 లక్షలు జమ చేశారు.

Published : 29 Nov 2022 03:32 IST

మెగా చెక్కును అందజేస్తున్న జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు,
 ఎంపీ బెల్లాన, కలెక్టర్‌ సూర్యకుమారి

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 60,033 మంది రైతులకు రూ.10.491 కోట్లు, పెట్టుబడి రాయితీ సొమ్ము కింద 506 మందికి రూ.17.91 లక్షలు జమ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టరేట్‌లో జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి తదితరులు సున్నా వడ్డీ రాయితీ, పెట్టుబడి రాయితీ మెగాచెక్కును లబ్ధిదారులకు అందజేశారు. డీసీఎంఎస్‌ ఛైర్‌పర్సన్‌ అవనాపు భావన, మాజీ ఛైర్మన్‌ సూర్యనారాయణరాజు, జిల్లా వ్యవసాయాధికారి వీటీ రామారావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని