logo

బాలికలను రక్షిద్దాం.. చదివిద్దాం

కిశోర బాలికలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ కేసలి అప్పారావు సూచించారు.

Published : 25 Jan 2023 02:58 IST

క్రీడాకారిణిని సత్కరిస్తున్న ఛైర్మన్‌, కలెక్టర్‌, ఎమ్మెల్సీ

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కిశోర బాలికలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ కేసలి అప్పారావు సూచించారు. బాలికలను రక్షిద్దాం.. వారిని చదివిద్దాం నినాదంతో జాతీయ బాలికా దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ రఘువర్మ, కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి మాట్లాడుతూ ఆడపిల్లలు ఉన్నత చదువు, లక్ష్యం సాధించాకే పెళ్లి కోసం ఆలోచించాలని సూచించారు.  ఈ సందర్భంగా  పుత్తడిబొమ్మ పూర్ణమ్మ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. క్రీడల్లో రాణిస్తున్న బాలికలను సత్కరించారు. మేయర్‌ వి.విజయలక్ష్మి, ఐసీడీఎస్‌ పీడీ బి.శాంతకుమారి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని