logo

ఆండ్రలో జైకా పనుల పరిశీలన

ఆండ్ర జలాశయ పరిధిలో గతేడాది జైకా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను జైకా ప్రిన్సిపల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషలిస్ట్‌(దిల్లీ) అనురాగ్‌ సిన్హా బుధవారం పరిశీలించారు.

Published : 26 Jan 2023 02:07 IST

కుడి కాలువను పరిశీలిస్తున్న అధికారులు

మెంటాడ, న్యూస్‌టుడే: ఆండ్ర జలాశయ పరిధిలో గతేడాది జైకా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను జైకా ప్రిన్సిపల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషలిస్ట్‌(దిల్లీ) అనురాగ్‌ సిన్హా బుధవారం పరిశీలించారు. కాలువలు, సిమెంటు పనులు, లైనింగ్‌ నిర్మాణాలను తనిఖీ చేశారు. అనంతరం రైతులతో సమావేశమయ్యారు. సాగునీటి సరఫరా, విడుదల సమయాలు తదితర వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా లోతుగెడ్డ ఉప సర్పంచి పైడిపునాయుడు, స్థానిక రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పిల్లకాలువలు, లైనింగ్‌ దెబ్బతిన్నాయని, మరమ్మతులు చేయాలని కోరారు. బట్టి కాలవలను శుభ్రం చేయాలని జయతి ఆలయ కమిటీ ఛైర్మన్‌ సత్యంనాయుడు, ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యులు రామచంద్రులు విన్నవించారు. రూ.15.95 కోట్లు విడుదల కాగా.. రూ.13.31 కోట్ల విలువైన పనులు జరిగాయని సిన్హా చెప్పారు. త్వరలోనే మిగిలిన ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. నిప్పన్‌ ప్రతినిధి షేక్‌ మహమ్మద్‌ సబ్జన్‌, నీటిపారుదలశాఖ ఎస్‌ఈ సూర్యకుమార్‌, కార్యనిర్వాహక ఇంజినీరు(స్కాడా) మోహన్‌రావు, ఈఈ శ్రీనివాసరావు, డీఈఈలు ఎస్‌.పాండు, ఎల్‌.గోవిందరావు, బి.సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని