logo

ప్రజాపోరు విజయవంతానికి కృషి అవసరం

భాజపా తలపెట్టిన ప్రజాపోరు విజయవంతానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

Updated : 01 Feb 2023 05:51 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

జిల్లా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న వీర్రాజు, పక్కన పావని తదితరులు

బొబ్బిలి, న్యూస్‌టుడే: భాజపా తలపెట్టిన ప్రజాపోరు విజయవంతానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం లోకబంధు రెసిడెన్సీలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఏయే ప్రాంతాల్లో ప్రజాపోరు నిర్వహించాలన్న దానిపై కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతోందని, ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు కృషి చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల  పేర్లు మార్చి రాష్ట్రం అమలు చేస్తోందని విమర్శించారు. పేదలకు కేంద్రం ఉచితంగా బియ్యం ఇస్తే వాటిని దారిమళ్లించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు చెప్పుకోవడం వింతగా ఉందన్నారు. రేషన్‌ పంపిణీ వాహనాలపై ప్రధాని ఫోటో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండు చేశారు. భాజపాలో కుటుంబ పాలన ఉండదన్నారు. ఎమ్మెల్సీ మాధవ్‌ మాట్లాడుతూ కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు పావని మాట్లాడుతూ భాజపాకు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. నాయకులు పైల వేణు, పెద్దింటి మనోజ్‌కుమార్‌, హరి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని