logo

తీర్మానాలు లేకుండా ఎలా ఖర్చు చేశారు?

బొబ్బిలి పురపాలికలో సభ్యులు వాకౌట్‌ చేయడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ సభ్యులు పురపాలికలో అవినీతి ఎక్కువవుతోందని వారు కొన్ని అంశాలను ఆరోపించారు.

Published : 01 Feb 2023 03:06 IST

బొబ్బిలి పురపాలికలో సభ్యుల మండిపాటు

దోషులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే శంబంగికి వినతిపత్రం ఇస్తున్న అధికార పార్టీ కౌన్సిలరు గోవింద

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి పురపాలికలో సభ్యులు వాకౌట్‌ చేయడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ సభ్యులు పురపాలికలో అవినీతి ఎక్కువవుతోందని వారు కొన్ని అంశాలను ఆరోపించారు. కమిషనర్‌, పుర అధ్యక్షులు వాహనాలు అద్దెకు తీసుకొని కౌన్సిల్‌ తీర్మానం లేకుండా నెలకు రూ.34 వేల నుంచి రూ.35 వేల చొప్పున ఎలా డ్రా చేస్తున్నారని నిలదీశారు. అద్దె వాహనాల్లో తిరుగుతున్నట్లు చూపితే పురపాలికకు చెందిన డ్రైవర్లు, ఇంధనాన్ని ఎలా వినియోగిస్తున్నారని ప్రశ్నించారు. ఈ మొత్తాలు సంబంధిత వ్యక్తుల నుంచి రికవరీ చేయాలని డిమాండు చేశారు. పురపాలికకు చెందిన ఓ వాహనం నాలుగు నెలలుగా మూలన ఉంటే తిప్పుతున్నట్లు ఇంధన ఖర్చులు ఎలా చూపారని వారు మండిపడ్డారు. పురపాలకకు చెందిన ప్రధాన తాగునీటిపైపులు 20 వరకు మార్చి కొత్తవి వేశారని, పాత వాటిలో ఎనిమిది పైపులు మాయమయ్యాయని, వాటి సంగతి తేల్చాలని డిమాండు చేశారు. గౌరవం ఇవ్వడం లేదని అధికార పార్టీ కౌన్సిలర్లు, సమావేశాల్లో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సరఫరా విభాగం చూసే ఇంజినీరును సస్పెండ్‌ చేయాలని డిమాండు చేయగా.. ముందుగానే సంబంధిత ఏఈ సెలవులో వెళ్లిపోయారు. అధికారులు సభ ప్రారంభంలోనే సభ్యులతో సంతకాలు చేయించడంతో అజెండా ఆమోదమైనట్లు చూపించడం, బడ్జెట్ను కూడా ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చూపించడం గమనార్హం.

కౌన్సిలర్ల వాకౌట్‌తో ఖాళీగా కనిపించిన కుర్చీలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని