logo

అనిశాకు చిక్కిన జేఈ

దత్తిరాజేరు మండలంలోని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగంలో విధులు నిర్వహిస్తున్న జేఈ ధనుంజయరావు మంగళవారం రాత్రి లంచం తీసుకుంటుండగా  అనిశాకు దొరికిపోయారు.

Published : 01 Feb 2023 03:06 IST

ధనుంజయరావు

విజయనగరం నేర వార్తవిభాగం, న్యూస్‌టుడే: దత్తిరాజేరు మండలంలోని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగంలో విధులు నిర్వహిస్తున్న జేఈ ధనుంజయరావు మంగళవారం రాత్రి లంచం తీసుకుంటుండగా  అనిశాకు దొరికిపోయారు. గతంలో ఆయన బొండపల్లి మండలంలో పనిచేసినప్పుడు ఎం.బుక్‌ కోసం సర్పంచి కర్రోతు శ్రీనివాసరావుకు రూ.20 వేలు లంచమివ్వాలని డిమాండు చేశారు. దీంతో అనిశా అధికారులను సర్పంచి ఆశ్రయించారు. విజయనగరంలోని ఉడాకాలనీలోని జేఈ ఉంటున్న సెల్లార్‌లో సర్పంచి నుంచి డబ్బులు తీసుకుంటుండగా వలపన్ని జేఈని పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకొని ఆయన్ని అరెస్టు చేసినట్లు అనిశా డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. కాగా దత్తిరాజేరులో ఉదయం మండల సమావేశానికి జేఈ హాజరయ్యారు. ఈ దాడిలో సీఐలు మహేష్‌, రమణ, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని