logo

ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరికి గాయాలు

ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం వెళ్తున్న బస్సు మండ గ్రామం సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించబోయి రోడ్డు పక్కనున్న వంతెన గోడను ఢీకొట్టింది

Published : 05 Feb 2023 04:26 IST

గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం నుంచి పార్వతీపురం వెళ్తున్న బస్సు మండ గ్రామం సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించబోయి రోడ్డు పక్కనున్న వంతెన గోడను ఢీకొట్టింది. ముందు భాగంలో ఉన్న ఇరుసు విరగడంతో చక్రాలు ఊడిపోయి బోల్తాపడింది. ఈ సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులున్నారు. కోనగూడకు చెందిన ఆరిక పావని, బబ్బిడికి చెందిన కె.విజయశాంతికి స్వల్ప గాయాలవగా మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను భద్రగిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనా స్థలానికి డీఎం దుర్గ, ఎల్విన్‌పేట సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ షణ్ముఖరావు చేరుకుని కారణాలపై ఆరా తీశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని