logo

‘నా అభిప్రాయం తీసుకుంటే బాగుండేది’

తెదేపా నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కర్రోతు బంగార్రాజును నియమించడంపై మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం తన స్వగ్రామమైన  చల్లవానితోటలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Published : 05 Feb 2023 04:43 IST

మాట్లాడుతున్న నారాయణస్వామినాయుడు

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: తెదేపా నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కర్రోతు బంగార్రాజును నియమించడంపై మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం తన స్వగ్రామమైన  చల్లవానితోటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇన్‌ఛార్జి ఎంపిక విషయంలో తన అభిప్రాయం తీసుకొని ఉంటే బాగుండేదన్నారు. 40 ఏళ్లుగా పార్టీకి ఎంతో కృషి చేశానని, ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉందని, సీనియర్‌ నాయకుడిగా గౌరవం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని తెలిపారు. పార్టీ కార్యక్రమాలపై కొద్ది రోజుల్లో కార్యకర్తలు, అభిమానులతో చర్చించి ముందుకు వెళ్తామన్నారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నంనాయుడు, పూసపాటిరేగ, డెంకాడ జడ్పీటీసీ మాజీ సభ్యులు అకిరి ప్రసాదరావు, పతివాడ అప్పలనరసయ్య, మండల అధ్యక్షుడు గౌరీశంకర్రావు, నాయకులు పి.తమ్మినాయుడు, పద్మ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు