logo

26 నుంచి చీపురుపల్లి కనకమహాలక్ష్మి జాతర

ఉత్తరాంధ్ర ప్రాంత ఆరాధ్య దైవం చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి 25వ జాతర మహోత్సవాలను ఈనెల 26 నుంచి మూడు రోజులపాటు భారీగా నిర్వహించనున్నట్లు జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఆలయ కమిటీ ఛైర్మన్‌ ఇప్పిలి సూర్యప్రకాశరావు తెలిపారు.

Published : 05 Feb 2023 04:43 IST

చీపురుపల్లి, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర ప్రాంత ఆరాధ్య దైవం చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి 25వ జాతర మహోత్సవాలను ఈనెల 26 నుంచి మూడు రోజులపాటు భారీగా నిర్వహించనున్నట్లు జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఆలయ కమిటీ ఛైర్మన్‌ ఇప్పిలి సూర్యప్రకాశరావు తెలిపారు. దేవస్థానంలో పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధుల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. దీనిపై వారు మాట్లాడుతూ ఏటా శివరాత్రి తరువాత వచ్చే ఆదివారం నుంచి జాతర జరపడం ఆనవాయితీ అయినా ఈసారి వారం ఆలస్యమవుతుందని తెలిపారు. ఆదివారం అమావాస్య కావడంతో సంప్రదాయం ప్రకారం తదుపరి వారం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, సాంస్కృతిక కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో సీఐ జి.సంజీవిరావు, ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు, కమిటీ వైస్‌ ఛైర్మన్‌ ఎస్వీ కుమారస్వామి, దేవస్థానం ఈవో జి.శ్రీనివాస్‌, వైకాపా నాయకులు కేవీ సూర్యనారాయణరాజు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, దన్నాన జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని