logo

మీరిచ్చిన హామీలే.. అయినా అరెస్టులా?

ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం అన్యాయమని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జేఆర్‌సీ.పట్నాయక్‌, జేఏవీఆర్‌కే.ఈశ్వరరావు అన్నారు.

Published : 06 Feb 2023 04:31 IST

ధర్నా చేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం అన్యాయమని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జేఆర్‌సీ.పట్నాయక్‌, జేఏవీఆర్‌కే.ఈశ్వరరావు అన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని సంక్షేమంలో భాగంగానే చూడాలని, ఓపీఎస్‌ అమలుతో ప్రభుత్వానికే లాభమన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఈనెల 3న గన్నవరంలో జరిగిన సంకల్పదీక్షను పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇందులో భాగంగా ఆదివారం కలెక్టరేట్‌ వద్ద సంకల్పదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తమకిచ్చిన హామీలు నెరవేర్చాలని, లేనిపక్షంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్‌ సబ్‌ కమిటీ జిల్లా కన్వీనర్‌ సీహెచ్‌.తిరుపతినాయుడు, యూటీఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎ.సత్యశ్రీనివాస్‌, సహాధ్యక్షుడు వి.ప్రసన్నకుమార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి, డి.రాము, నాయకులు కె.ప్రసాదరావు, ఎం.కేశవరావు, జి.రాజారావు, సూర్యారావు, వి.రాధాభవానీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని