logo

కలెక్టరేట్‌ను ముట్టడించిన అంగన్వాడీ కార్యకర్తలు

తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ  సీఐటీయూ ఆధ్వర్యంలో  అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు సోమవారం విజయనగరం కలెక్టరేట్‌ను  ముట్టడించారు. 

Updated : 06 Feb 2023 20:43 IST

విజయనగరం కలెక్టరేట్‌: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ  సీఐటీయూ ఆధ్వర్యంలో  అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు సోమవారం విజయనగరం కలెక్టరేట్‌ను  ముట్టడించారు. సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు రూ.5 లక్షలు,  వేతనంలో సగం పింఛన్లు ఇవ్వాలని కోరారు. అంగన్వాడీలకు ఫేస్‌ యాప్‌ హాజరు విధానాన్ని రద్దు చేయాలని , పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలని, సూపర్‌వైజర్‌ పోస్టులకు వయో పరిమితి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌, అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పైడిరాజు, ఎస్‌.అనసూయ,  గౌరవాధ్యక్షురాలు వి.లక్ష్మి, అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని