logo

ఆ డబ్బులతో ఇల్లు కట్టగలరా?

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.1.80 లక్షలు సరిపోవడం లేదని, లబ్ధిదారులకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని పలువురు నాయకులు డిమాండు చేశారు.

Published : 07 Feb 2023 03:08 IST

కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న నాయకులు

విజయనగరం గంటస్తంభం, న్యూస్‌టుడే: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.1.80 లక్షలు సరిపోవడం లేదని, లబ్ధిదారులకు రూ.5 లక్షల చొప్పున ఇవ్వాలని పలువురు నాయకులు డిమాండు చేశారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ నిరసనకు తెదేపా, సీపీఎం, లోక్‌సత్తా, జనసేన, ఆమ్‌ఆద్మీ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఇంటి నిర్మాణానికి ఇచ్చే ఆర్థికసాయాన్ని పెంచాలని, కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, టిడ్కో ఇళ్లను వెంటనే అప్పగించాలని డిమాండు చేశారు. ప్రస్తుతం ఇస్తున్న సొమ్ము పునాదులకు కూడా సరిపోవడం లేదన్నారు. రోడ్లు, కాలువలు, నీరు, విద్యుత్తు సదుపాయాలు లేకుండా అక్కడెలా ఉండగలరని ప్రశ్నించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శులు బుగత అశోక్‌, అలమండ ఆనందరావు, మద్ది కృష్ణ, ఎస్‌.రంగరాజు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డి శంకరరావు, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ.రాజు, ఆమ్‌ఆద్మీ జిల్లా అధ్యక్షుడు కె.దయానంద్‌, లోక్‌సత్తా, జనసేన నాయకులు రాజారావు, త్యాడ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని