logo

ప్రకటన లేకుండా కొలువుల భర్తీ?

ఖాళీల పరిశీలన.. ప్రకటన విడుదల.. పరీక్షలు.. నియామకాలు ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో కొలువల నియామకానికి సాధారణంగా జరిగే ప్రక్రియలివి.

Published : 07 Feb 2023 03:08 IST

హాజరైన అభ్యర్థులు

విజయనగరం మయూరికూడలి, న్యూస్‌టుడే: ఖాళీల పరిశీలన.. ప్రకటన విడుదల.. పరీక్షలు.. నియామకాలు ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో కొలువల నియామకానికి సాధారణంగా జరిగే ప్రక్రియలివి. కానీ జిల్లాలోని పలు గురుకులాల్లో పోస్టుల భర్తీకి అధికారులు హడావుడిగా చర్యలు మొదలు పెట్టారు. ఎవరికీ చెప్పకుండానే గుట్టుగా మౌఖిక పరీక్షలు పెట్టేశారు. ఈ విషయం బయటకు తెలియడంతో అప్పటికప్పుడు కొత్త ప్రకటన ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని నెల్లిమర్ల, కొప్పెర్ల, వంగరలోని గురుకులాల్లో ఆరోగ్య కార్యకర్తలు అవసరం కాగా జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌లో అర్హతలున్న వారిని అతిథి బోధనకు తీసుకునేందుకు సోమవారం విజయనగరంలోని గురుకులాల సమన్వయాధికారిణి కార్యాలయంలో ముఖాముఖి నిర్వహించారు. కేవలం ఎంపిక చేసిన వారిని మాత్రమే పిలవడం గమనార్హం. దీనిపై వివరాలేవీ బయటపెట్టలేదు. ఈ పరిస్థితిపై గురుకులాల సమన్వయాధికారిణి చంద్రావతిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. గతంలో పనిచేసిన వారినే పిలిచామని చెప్పారు. ఎనిమిది మంది హాజరు కాగా.. వారెవరూ ఉత్తీర్ణులు కాలేదన్నారు. కొత్తగా ప్రకటన ఇస్తున్నామని, ఈ నెల 10లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు