logo

రాష్ట్రాభివృద్ధి తెదేపా ధ్యేయం

తెలుగుజాతి భవిష్యత్తు, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి తెదేపా పనిచేస్తోందని పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌ గజపతిరాజు పేర్కొన్నారు.

Published : 30 Mar 2023 02:30 IST

పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న అశోక్‌గజపతిరాజు

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: తెలుగుజాతి భవిష్యత్తు, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి తెదేపా పనిచేస్తోందని పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌ గజపతిరాజు పేర్కొన్నారు. అందరూ అంకితభావంతో కలిసికట్టుగా ముందుకెళ్లాలని  శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బంగ్లాలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అశోక్‌ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో తెదేపా కీలకపాత్ర పోషించిందని, ప్రజల కోసం తెచ్చిన అనేక సంక్షేమ పథకాలు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనపై విసుగెత్తిపోయారని, ఈ విషయం  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలతో బయటపడిందన్నారు. ఒకే పార్టీ రాష్ట్రంలో ఉండాలనే మనస్తత్వాన్ని మార్చుకోవాలని పరోక్షంగా జగన్‌కు సూచించారు. విభజన హామీల అమలు కోసమే మోదీని జగన్‌ కలుస్తున్నారనడం నమ్మలేమని వ్యాఖ్యానించారు. అనంతరం మహిళా నేతలు కేకు కోశారు. దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను సన్మానించారు. కె.శివరామకృష్ణ, పి.వరప్రసాద్‌, కె.మురళీనాయుడు, అశోక్‌వర్మ, అనూరాధ బేగం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు