logo

పంట నష్టం ఎంత?

ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు  చేతికొస్తున్న తరుణంలో అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచేశాయి.

Published : 30 Mar 2023 02:30 IST

31 తర్వాత గ్రామాల్లో జాబితాల ప్రదర్శన

తడిసిన మొక్కజొన కండెలు పరిశీలిస్తున్న అధికారి (పాత చిత్రం)

కలెక్టరేట్‌/విజయనగరం వ్యవసాయ విభాగం, న్యూస్‌టుడే: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు  చేతికొస్తున్న తరుణంలో అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచేశాయి. మొక్కజొన్న, అరటికి అపార నష్టం సంభవించింది. కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు కలిగిన ఈ నష్టాలపై జాబితాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ప్రక్రియ ప్రారంభించారు. 13 మండలాల్లో 100కు పైగా గ్రామాల్లో మొక్కజొన్న, అరటి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. నష్టపోయిన రైతుల జాబితాల తయారీకి గ్రామ, మండల, డివిజన్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇవి ఈ నెల 31 లోగా నివేదికల్ని జిల్లా కార్యాలయానికి అందజేయాలి. తర్వాత వాటిని సామాజిక తనిఖీ నిమిత్తం గ్రామాల్లో ప్రదర్శించి ప్రభుత్వానికి నివేదిస్తారు. 33 శాతానికి పైగా పంట నష్టం జరిగితేనే పరిహారం అందుతుందనే నిబంధనపై కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుకు అయిదెకరాలకే పరిమితం చేయడం, ఈ-పంట నమోదు తప్పనిసరి అంటుండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జాబితా తయారు చేయాలని సూచించామని జేసీ కె.మయూర్‌ అశోక్‌  తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 90 శాతం పంట నష్ట గణన పూర్తయ్యిందని, గ్రామాల్లో రైతులు ఆర్‌బీకే సహాయకులకు వివరాలు చెప్పి నమోదు చేయించుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని