logo

పకడ్బందీగా పది పరీక్షలు

పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.

Published : 30 Mar 2023 02:30 IST

విద్యాశాఖ అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ సూర్యకుమారి

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌తో కలిసి ఆయన కలెక్టర్లతో బుధవారం దూరదృశ్య సమావేశం నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు రవాణా ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జిల్లాలో 127 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నామని సమావేశం అనంతరం కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి వివరించారు. 24,099 మంది రెగ్యులర్‌, 1,428 మంది ప్రైవేట్‌ విద్యార్థులు హాజరుకానున్నట్లు చెప్పారు. కేంద్రాలను ఎంపీడీవోలు, తహసీల్దార్లు తనిఖీ చేసి, రోజూ నివేదికలు అందజేయాలన్నారు. తొమ్మిది ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను తహసీల్దారు ఆధ్వర్యంలో వేస్తున్నట్లు చెప్పారు. సందేహాలకు, సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం 94943 26124 నంబరును సంప్రదించాలని సూచించారు. డీఆర్వో ఎం.గణపతిరావు, డీఈవో లింగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని