logo

కిసాన్‌ మేళాలతో పాడి పరిశ్రమకు మేలు

రైతులకు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించి పాడి పరిశ్రమను లాభదాయకంగా మార్చేందుకే తిరుపతి శ్రీవేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం (ఎస్‌వీవీయూ) కిసాన్‌ మేళాలు నిర్వహిస్తున్నట్లు ఆ వర్సిటీ విస్తరణ సంచాలకుడు గుంట్రెడ్డి వెంకటనాయుడు అన్నారు.

Published : 30 Mar 2023 02:30 IST

మాట్లాడుతున్న విస్తరణ సంచాలకుడు వెంకట నాయుడు

గరివిడి, న్యూస్‌టుడే: రైతులకు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించి పాడి పరిశ్రమను లాభదాయకంగా మార్చేందుకే తిరుపతి శ్రీవేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం (ఎస్‌వీవీయూ) కిసాన్‌ మేళాలు నిర్వహిస్తున్నట్లు ఆ వర్సిటీ విస్తరణ సంచాలకుడు గుంట్రెడ్డి వెంకటనాయుడు అన్నారు. గరివిడి పశువైద్య కళాశాలలో జిల్లాస్థాయి కిసాన్‌ మేళా నిర్వహించారు. రైతులకు ఆధునిక సాంకేతిక సమాచారాన్ని చేరువ చేసేందుకు ఇటువంటి మేళాలు ఉపయోగపడతాయన్నారు. అధిక పాల దిగుబడికి పాటించాల్సిన మెలకువలు, పునరుత్పత్తి సమస్యలు, నివారణ చర్యలను రైతులకు వివరించారు. పశు సంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు వైవీ రమణ, నాబార్డు డీడీఎం టి.నాగార్జున, పశువైద్య కళాశాల అసోసియేట్‌ డీన్‌ ఎం.శ్రీను రైతులతో చర్చాగోష్ఠి నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని