logo

‘ఉక్కు కర్మాగారం అమ్మకాన్ని ఆపాలి’

విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకాన్ని ఆపాలని సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కె.సురేష్‌, ఎస్‌.రంగరాజు డిమాండు చేశారు.

Updated : 02 Apr 2023 06:15 IST

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకాన్ని ఆపాలని సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కె.సురేష్‌, ఎస్‌.రంగరాజు డిమాండు చేశారు. కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన పోరాటం 700 రోజులకు చేరిన సందర్భంగా సంఘీభావాన్ని తెలియజేస్తూ కార్మికసంఘాల ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాట్లాడారు. వందశాతం ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలు తిప్పి కొట్టేందుకు భారీ పోరాటాలకు కార్మికులు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. పోరాటానికి రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక, రైతాంగం, ప్రజా సంఘాలు, ప్రజలు, వర్తక వ్యాపార వర్గాలు మద్దతు పలుకుతున్నాయన్నారు. కార్మిక సంఘాల నాయకులు బి.రమణ, యు.ఎస్‌.రవికుమార్‌, ఆర్‌.శంకరరావు, పి.అప్పారావు, శ్రీను, నాయుడు, ఐద్వా, కేవీపీఎస్‌ నాయకులు పి.రమణమ్మ, ఆర్‌.ఆనంద్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని