logo

ఆంధ్రా పోలీసులపై ధర్మేంద్ర ఆగ్రహం

కొఠియా గ్రామాలకు సంబంధించి ఒడిశా-ఆంధ్రప్రదేశ్‌ల మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. అనేకసార్లు ఆంధ్రా అధికారులను ఒడిశా ప్రజా ప్రతినిధులు, అధికారులు అడ్డుకొన్న విషయం తెలిసిందే.

Published : 02 Apr 2023 05:33 IST

వాదిస్తున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొఠియా గ్రామాలకు సంబంధించి ఒడిశా-ఆంధ్రప్రదేశ్‌ల మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. అనేకసార్లు ఆంధ్రా అధికారులను ఒడిశా ప్రజా ప్రతినిధులు, అధికారులు అడ్డుకొన్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం కొఠియా గ్రామాల్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పర్యటిస్తూ పట్టుచెన్నూరు చేరుకున్నారు. అదే సమయంలో ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో గల సాలూరు పోలీస్‌ స్టేషన్‌ కొఠియా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రోహిణిపతి సిబ్బందితో కలిసి శాంతిభద్రతల పర్యవేక్షణకు వచ్చారు. వారు ధర్మేంద్ర ప్రధాన్‌కు ఎదురు పడడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశా గ్రామాల్లోకి ఎందుకు వస్తున్నారని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. గంటసేపు కేంద్రమంత్రి, సీఐ మధ్య వాదన జరిగింది. కేంద్ర మంత్రితోపాటు అక్కడున్నవారు ఆంధ్రా గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. దాంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని