logo

ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలం: కిమిడి

రాష్ట్రంలో యువత నిరుద్యోగంతో సతమతమవుతోందని తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పేర్కొన్నారు. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.

Published : 02 Apr 2023 05:47 IST

మాట్లాడుతున్న నాగార్జున

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో యువత నిరుద్యోగంతో సతమతమవుతోందని తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పేర్కొన్నారు. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. శనివారం అశోక్‌ బంగ్లాలో విలేకర్లతో మాట్లాడారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు రాకపోవడంతో యువతకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చినా ప్రోత్సాహం లేకపోవడంతో వెనుదిరుగుతున్నారని ఆరోపించారు. ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమలకు విద్యుత్తు ఛార్జీల పెంపుతో జిల్లాలో రోజుకు రూ.22 లక్షల అదనపు భారం పడుతోందన్నారు. సమావేశంలో నాయకులు ప్రసాదుల వరప్రసాద్‌, కంది మురళీనాయుడు, వేచలపు శ్రీనివాసరావు, ముద్దాడ చంద్రశేఖర్‌, కోండ్రు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని