logo

పోలీసులకు రుణ సౌకర్యం

పోలీసుల అభివృద్ధి, సంక్షేమంలో భాగంగా వారి అవసరాలకు తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం కల్పిస్తున్నామని ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ తెలిపారు.

Published : 02 Apr 2023 05:47 IST

ఉపకారవేతనాలు అందిస్తున్న ఎస్పీ

నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: పోలీసుల అభివృద్ధి, సంక్షేమంలో భాగంగా వారి అవసరాలకు తక్కువ వడ్డీకే రుణ సౌకర్యం కల్పిస్తున్నామని ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ తెలిపారు. కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ సభ్యుల అంగీకారంతో వ్యక్తిగత, పిల్లల చదువు, పెళ్లికి అవసరమైన రుణాలు ఇస్తారన్నారు. అనంతరం పది, ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబర్చిన సొసైటీ సభ్యుల పిల్లలకు రూ.41,500 ఉపకారవేతనాలు అందజేశారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ సోల్మన్‌, ఏఆర్‌ డీఎస్పీ ఎల్‌.శేషాద్రి, ఎస్‌బీ సీఐలు రుద్రశేఖర్‌, ఆర్‌ఐలు బి.రమణమూర్తి, టీవీఆర్‌కే కుమార్‌, సొసైటీ కార్యదర్శి నీలకంఠం, పోలీసు అధికారుల సంక్షేమ సంఘం అడహక్‌ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, సభ్యులు, హోంగార్డుల సొసైటీ కార్యదర్శి సుశీల పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని