logo

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు

ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం తన ఛాంబర్లో జిల్లా వైద్యశాఖ అధికారులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్య నిపుణులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Published : 02 Apr 2023 05:47 IST

వైద్యాధికారులతో సమీక్షిస్తున్న జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం తన ఛాంబర్లో జిల్లా వైద్యశాఖ అధికారులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్య నిపుణులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చే వారికి వైద్యం అందించాలని, రోగిని చూడకుండా రిఫర్‌ చేయకూడదని పేర్కొన్నారు. రాత్రివేళల్లో పాముకాటు, ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణమే వైద్యం చేసే పరిస్థితి ఉండాలని, ఓపీ, శస్త్రచికిత్సలు పెరగాలన్నారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులంతా ఎల్లప్పుడూ అండగా నిలుస్తామన్నారు. ఎలాంటి లోటుపాట్లు ఉన్నా, తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానన్నారు. ఘోష, సర్వజన ఆసుపత్రులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు సమకూర్చుతానని భరోసానిచ్చారు. పారిశుద్ధ్యం, నీటి సమస్యలపై నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎం.అశోక్‌కుమార్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి ఎస్‌.వి.రమణకుమారి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకుడు అప్పలనాయుడు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని