logo

ఎన్టీఆర్‌ దేవుడిలా ఉండేవారు: బేబినాయన

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన వీరాభిమానులను బొబ్బిలి కోటలో గురువారం తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన సత్కరించారు.

Published : 26 May 2023 02:53 IST

బొబ్బిలి, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన వీరాభిమానులను బొబ్బిలి కోటలో గురువారం తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన సత్కరించారు. అంతకుముందు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన చిన్నతనంలో ఎన్టీఆర్‌ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని, ఆయన వేసిన పాత్రలు చూసి నివ్వెరపోయేవారమన్నారు. దేవుళ్లు ఎలా ఉంటారో తెలియదుకానీ ఆ పాత్రలు చూసి దేవుళ్లు ఇలా ఉండేవారేమోనని అనుకునేవాడినని తన అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్‌ అభిమాన సంఘ నాయకుడు కనకమహేశ్‌ పట్నాయక్‌, తెదేపా పట్టణాధ్యక్షుడు శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని