logo

కొలిక్కిరాని బదిలీలు

ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ రెండో రోజూ కొలిక్కిరాలేదు. బుధవారం అర్ధరాత్రి వరకూ జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైన అధికారులు ఉన్నతాధికారుల ఆమోదం కోసం గురువారం సాయంత్రం వరకు నిరీక్షించారు.

Published : 02 Jun 2023 03:12 IST

ఇదీ పరిస్థితి

* విద్యాశాఖలో ప్రొవిజినల్‌ సీనియార్టీ జాబితాపై 357 మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నివృత్తి అనంతరం శుక్ర, శనివారాల్లో తుది సీనియార్టీ జాబితాలు వెల్లడించనున్నట్లు శాఖావర్గాలు ప్రకటించాయి.


* రెవెన్యూలో తొమ్మిది మంది తహసీల్దార్లు, 17 మంది ఉప తహసీల్దార్లకు స్థానచలనమైంది. సీనియర్‌ సహాయకులు, జూనియర్‌ సహాయకులు, వీఆర్వోల విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.


* ఖజానా శాఖలో సబార్డినేట్‌ నుంచి సీనియర్‌ సహాయకుని వరకు ఆరుగురికే బదిలీలయ్యాయి. రాష్ట్రస్థాయిలో డీడీ, ఏటీవో కేడర్ల ప్రక్రియ సాగుతోందని ఇన్‌ఛార్జి డీడీ కుమార్‌ తెలిపారు.


* జిల్లా పరిషత్తు, పంచాయతీరాజ్‌, వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి వివరాలు రాలేదు.

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ రెండో రోజూ కొలిక్కిరాలేదు. బుధవారం అర్ధరాత్రి వరకూ జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైన అధికారులు ఉన్నతాధికారుల ఆమోదం కోసం గురువారం సాయంత్రం వరకు నిరీక్షించారు. కొన్నిశాఖలకు సంబంధించిన వాటిని మాత్రమే అధికారికంగా ప్రకటించారు. దీంతో ఇంకా కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం గడువు నిర్దేశించినా రెండు మూడు రోజుల సమయం పడుతుందని జిల్లా అధికారులు చెబుతున్నారు.

నేటి నుంచి అధ్యాపకులకు..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న రెగ్యులర్‌ అధ్యాపకులు, సిబ్బంది శుక్రవారం నుంచి ఈ నెల నాలుగో తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. జిల్లాలో అయిదేళ్లు నిండిన వారు 28 మంది ఉన్నారు. వీరు తప్పక బదిలీ కానున్నారు. సున్నా సర్వీసు వారికీ అవకాశం ఉందని డీవీఈవో సురేష్‌కుమార్‌ తెలిపారు.


టీపీబీవోకు ఉద్యోగోన్నతి

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: నగరపాలక  సంస్థ పట్టణ ప్రణాళికా విభాగంలో టీపీబీవో(టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీస్‌)గా పనిచేస్తున్న ఫిలిప్‌కు ఉద్యోగోన్నతి లభించింది. టీపీఎస్‌(టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌)గా శ్రీకాకుళం పురపాలక సంస్థకు ఆయన బదిలీపై వెళ్లనున్నారు. విజయనగరంలోనే కొనసాగే విధంగా ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సులు వెళ్లినట్లు సమాచారం.


‘ వెలుగు’లో..

మయూరికూడలి, న్యూస్‌టుడే: సెర్ప్‌ శాఖ ఆదేశాల మేరకు వెలుగు విభాగంలో బదిలీలు జరిగాయి. మొత్తం 28 మందికి స్థానచలనమైనట్లు డీఆర్డీఏ పీడీ కల్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో వర్కు ఆర్డర్లు ఇచ్చి, ప్రాంతాలు కేటాయించారు.


జిల్లా రిజిస్ట్రార్‌కు..

విజయనగరం కోట, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా రిజిస్ట్రార్‌ ఎం.సృజనకు విశాఖపట్నం బదిలీ అయింది. ఈమె స్థానంలో విజయవాడలోని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కార్యాలయంలో ఏఐజీగా పనిచేస్తున్న ఎ.వి.కుమారి రానున్నారు.


విజయవాడకు ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ

కోట, న్యూస్‌టుడే: రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షక ఇంజినీర్‌(ఎస్‌ఈ) వి.కె.విజయశ్రీ విజయవాడ సర్కిల్‌కు బదిలీ అయ్యారు. ఒంగోలు ఎస్‌ఈ కె.విజయరత్నంను ఆమె స్థానంలో నియమించారు. ఆర్‌అండ్‌బీ డీఈ ఎ.అప్పలనాయుడును జిల్లాలోని క్వాలిటీ కంట్రోల్‌ విభాగానికి పంపించారు. అక్కడ పనిచేస్తున్న సి.హెచ్‌.విద్యావాణి గజపతినగరం డీఈగా నియమితులయ్యారు. విజయనగరం జేఈ నందకుమార్‌ ఇక నుంచి భోగాపురంలో విధులు నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు