logo

విదేశాల్లోనూ పార్వతీపురం గళం

తెలుగునాట పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన తరువాత ఆ స్థాయిలో గుర్తింపు పొందారు మన్యం జిల్లాకు చెందిన గంటా మంగాదేవి.

Published : 02 Jun 2023 03:12 IST

ఈనాడు, విజయనగరం: తెలుగునాట పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి. ఆయన తరువాత ఆ స్థాయిలో గుర్తింపు పొందారు మన్యం జిల్లాకు చెందిన గంటా మంగాదేవి. రంగస్థలంలో కొన్ని పాత్రలు పురుషులకే పరిమితం కాదని నిరూపిస్తూ.. హరిశ్చంద్రుడిగా, అర్జునుడిగా తన నటనతో అందరినీ మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతనెలలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆహ్వానంపై అమెరికాలో పది రోజులు పర్యటించి అట్లాంటా.. న్యూజెర్సీల్లో మూడు చోట్ల ప్రదర్శనలిచ్చారు. ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల సందర్భంగా న్యూజెర్సీలో ప్రదర్శనలిచ్చారు. బుధవారం రాత్రి తిరిగొచ్చామని, ఈ పర్యటన ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మంగాదేవి ‘ఈనాడు’తో అన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర నుంచి హాజరైన పది మంది కళాకారుల్లో తానొకరినని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని