logo

వెళ్తున్నారు.. వస్తున్నారు

ఉమ్మడి జిల్లాలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని శాఖల్లో ఇంకా కొలిక్కిరావాల్సి ఉంది. ఇతర ప్రాంతాలకు చెందిన అధికారులు శుక్రవారం ఇక్కడకు వచ్చారు.

Published : 03 Jun 2023 03:39 IST

కొనసాగుతున్న బదిలీలు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని శాఖల్లో ఇంకా కొలిక్కిరావాల్సి ఉంది. ఇతర ప్రాంతాలకు చెందిన అధికారులు శుక్రవారం ఇక్కడకు వచ్చారు. ఇంకొందరు బయట జిల్లాలకు వెళ్లారు.

కొన్నిశాఖల్లో   ఇలా..

జిల్లా పరిషత్తుకు సంబంధించి ఎంపీడీవోల బదిలీలు కొలిక్కి వచ్చాయి. 11 మందికి పదోన్నతులు దక్కాయి. జియ్యమ్మవలస ఎంపీడీవో విజయలక్ష్మిని బలిజిపేట మండలానికి బదిలీ చేసినట్లు జడ్పీ సీఈవో అశోక్‌కుమార్‌ తెలిపారు.

భూముల సర్వేశాఖలో ముగ్గురు సర్వేయర్లు, అయిదుగురు ఉప సర్వేయర్లకు స్థానచలనమైంది.

రెవెన్యూ, పంచాయతీశాఖల్లో జాబితాలు సిద్ధం చేసినప్పటికీ కొన్ని కేడర్లకే ఉత్తర్వులు అందజేశారు.


డీఎంహెచ్‌వో బాధ్యతల స్వీకరణ

వైద్యవిభాగం: వైద్యారోగ్యశాఖ విజయనగరం జిల్లా అధికారిగా ఎస్‌.భాస్కర్‌రావు తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో డిప్యూటీ సివిల్‌ సర్జన్‌గా పనిచేస్తున్న ఈయనను డీఎంహెచ్‌వో(పూర్తి అదనపు బాధ్యతలు)గా నియమించారు. ఇంతవరకు ఇక్కడ విధులు నిర్వహించిన ఎస్‌వీ.రమణకుమారి పదవీ విరమణ చేశారు.


సహాయ ఆడిట్‌ అధికారిణిగా..

విజయనగరం జిల్లా సహాయ ఆడిట్‌ అధికారిణిగా సి.హెచ్‌.ప్రభావతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా జడ్పీ విభాగంలో సహాయ ఆడిట్‌ అధికారిణిగా పనిచేసి, ఇక్కడకు వచ్చారు. 2018 గ్రూప్‌-1కి ఎంపికైన ఆమె రాష్ట్రంలో ప్రీఆడిట్‌ విధానాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టి గుర్తింపు పొందారు.


ఐటీఐ కన్వీనరుగా గిరి

టీఐ విద్య విజయనగరం జిల్లా కన్వీనరు, విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రధానాచార్యుడిగా టి.వి.గిరి నియమితులయ్యారు. సీతంపేట ప్రభుత్వ ఐటీఐ నుంచి వచ్చారు. ఇక్కడ పనిచేసిన ప్రధానాచార్యులు జి.గోపాలకృష్ణ సీతంపేట వెళ్లనున్నారు. శిక్షణాధికారిగా విధులు నిర్వహించిన శ్రీనివాసరావు గాజువాక ఐటీఐకి వెళ్లగా అక్కడ పనిచేసిన జి.రామాచారి ఇటు రానున్నారు.


తూనికలు- కొలతల శాఖకు కొత్తోళ్లు..

విజయనగరం నేరవార్తావిభాగం/పట్టణం: తూనికలు- కొలతల శాఖ మూడు జిల్లాల సహాయ సంచాలకుడిగా విశాఖపట్నం నుంచి వచ్చిన జి.మధుసూదన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన ఎన్‌.జనార్దనరావు కాకినాడ బదిలీ అయ్యారు. జిల్లా ఇన్‌స్పెక్టర్‌ రాధాకృష్ణ గాజువాకకు వెళ్లగా ఆయన స్థానంలో అనకాపల్లి నుంచి వచ్చిన రంగారెడ్డి దస్త్రాలపై సంతకం చేశారు.

నగరపాలక సంస్థ డీఈఈగా బి.రామసుబ్బారావు నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం శ్రీకాకుళంలో డీఈఈగా చేస్తున్నారు.

ప్రజారోగ్యశాఖలో పనిచేస్తున్న సీహెచ్‌.చంద్రమౌలికి ఆశాఖ క్యూసీ సబ్‌ డివిజన్‌ ఏఈఈగా స్థానచలనమైంది. అక్కడ పనిచేస్తున్న ఎల్‌.రాధను ఈయన స్థానంలో వేశారు.

మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్లు ఎన్‌.శ్రీను, కె.పార్వతి విశాఖ జీవీఎంసీకి వెళ్లనుండగా.. అక్కడ నుంచి మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న ఎల్‌వీవీఎస్‌పీ.కుమార్‌ రానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని