logo

అద్దె భవనాల్లోనే అంగన్‌వాడీలు

కొఠియా వివాదాస్పద గ్రామాల్లోని శిఖరాగ్రాన ఉన్న పగులుచెన్నూరు, పట్టుచెన్నూరులో పది అంగన్‌వాడీ కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి.

Published : 03 Jun 2023 03:39 IST

సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కొఠియా వివాదాస్పద గ్రామాల్లోని శిఖరాగ్రాన ఉన్న పగులుచెన్నూరు, పట్టుచెన్నూరులో పది అంగన్‌వాడీ కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నాయి. దాదాపు అదే సంఖ్యలో ఒడిశా ప్రభుత్వం కూడా కేంద్రాలను నిర్వహిస్తోంది. ఆంధ్రాకున్న అన్ని కేంద్రాలు అద్దెళ్లల్లో కొనసాగుతుండగా.. ఒడిశాకు అధికంగా సొంత భవనాలున్నాయి. తాజాగా ఎగువమెండంగిలో నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. గతేడాది అప్పటి పీవో కూర్మనాథ్‌ స్వయంగా ఆయా గ్రామాల్లో పర్యటించి నిర్మాణాలు చేపట్టాలని స్థానికులను కోరారు. పట్టుచెన్నూరులో పునాదుల కోసం గోతులు తీసినా పనులు ముందుకు సాగలేదు. పగులుచెన్నూరులో స్లాబ్‌దశకు వచ్చినా ఇప్పటి వరకూ బిల్లు ఇవ్వలేదు. ఎగువ గంజాయిభద్ర, కోనధార తదితర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీనిపై ఐటీడీఏ ఏఈ సంతోష్‌ మాట్లాడుతూ పగులుచెన్నూరులో నిర్మాణానికి బిల్లు పెట్టామని, రావాల్సి ఉందని చెప్పారు. మిగిలిన చోట్ల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని