logo

వైభవంగా వేణుగోపాలస్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు

గరివిడి బంగారమ్మ కాలనీలో బమ్మిడి అప్పలస్వామి, కృష్ణమ్మ దంపతుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించిన  వేణుగోపాలస్వామి, గోదాదేవి, భగవద్రామానుజాచార్యుల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Published : 03 Jun 2023 03:39 IST

గరివిడి, న్యూస్‌టుడే: గరివిడి బంగారమ్మ కాలనీలో బమ్మిడి అప్పలస్వామి, కృష్ణమ్మ దంపతుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించిన  వేణుగోపాలస్వామి, గోదాదేవి, భగవద్రామానుజాచార్యుల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం వేదగురువు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి ప్రత్యేక పూజలు చేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ పూజల్లో పాల్గొన్నారు. బొత్స దంపతులు చిన్నజీయర్‌ స్వామికి చిత్రపటాన్ని బహూకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అన్నసమారాధన ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణాహుతితో ప్రతిష్ఠ కార్యక్రమం ముగుస్తుందని ఆలయ ధర్మకర్త అప్పలస్వామి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని