TS News: వరంగల్‌ జిల్లాలో ‘ఆంత్రాక్స్‌’ కలకలం

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలంలో ‘ఆంత్రాక్స్‌’ కలకలం రేగింది.

Updated : 26 Oct 2021 13:28 IST

దుగ్గొండి: వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలంలో ‘ఆంత్రాక్స్‌’ కలకలం రేగింది. మండలంలోని చాపలబండ గ్రామంలో గొర్రెలకు ఆంత్రాక్స్‌ వ్యాధి సోకినట్లు పశువైద్యాధికారులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన గజ్జెల సాంబయ్య గొర్రెల మందలో గత నాలుగు రోజులుగా రోజుకో గొర్రె చొప్పున మృతి చెందుతోంది. ఈ విషయమై సాంబయ్య పశువైద్యాధికారులను సంప్రదించగా మృతి చెందిన గొర్రెను ల్యాబ్‌కు పంపాలని సూచించారు. ఈ క్రమంలోనే సోమవారం మృతి చెందిన ఓ గొర్రెను ల్యాబ్‌కు తీసుకెళ్లగా పరీక్షలు చేసిన అధికారులు ఆంత్రాక్స్‌ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. మంగళవారం ఉదయం జేడీ బాలకృష్ణ గ్రామాన్ని సందర్శించి వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గొర్రెల కాపరులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని