TS News: మీ పిల్లలు భద్రం.. మీరు రాకండి..!
చరవాణిలో ధైర్యం చెబుతున్న ప్రత్యేకాధికారిణి
దేవరుప్పుల(జనగామ జిల్లా), న్యూస్‌టుడే: గురుకులాల్లో కరోనా వ్యాపిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో కస్తూర్బా బాలికా విద్యాలయాలు అప్రమత్తమయ్యాయి. ప్రత్యేకాధికారిణి పూనెం సంయుక్తారాణి జిల్లాలోని పాఠశాలల ప్రత్యేకాధికారులతో చరవాణి ద్వారా మాట్లాడి విద్యార్థుల ఆరోగ్యం ప్రధానమని, బయటివారిని ఎవరినీ పాఠశాలలోకి అనుమతించొద్దని, చివరికి తల్లిదండ్రులకు కూడా అనుమతించొద్దని ఆదేశించారు. విద్యార్థులకు తల్లిదండ్రులకు ఫోన్ చేసి పాఠశాలలో తీసుకుంటున్న చర్యలను వివరించాలని సిబ్బందికి సూచించారు. మరీ అవసరమైతే విద్యార్థులతో చరవాణి ద్వారా మాట్లాడించాలన్నారు. వసతిగృహానికి తెచ్చే సరకులను ఒకటికి రెండుసార్లు శుభ్రం చేసి వినియోగించాలని సూచించారు. ఉపాధ్యాయులు, వంటవారు నిరంతరం శానిటైజేషన్ చేసుకోవడంతోపాటు మాస్కులు ధరించాలని ఆదేశించారు. ఎవరైన విద్యార్థి అసౌకర్యంగా ఉంటే వెంటనే స్పందించి వైద్యులను సంప్రదించాలన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.