logo

TS News: ప్రేమకు ప్రతిరూపం మూడేళ్లకే మృత్యువాత!

ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన బాలుడు మూడేళ్లకే మృత్యువాతపడటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి చెందిన బయ్య దివ్య, వెంకటేశ్‌ దంపతులది ప్రేమ వివాహం.

Updated : 11 Jan 2022 09:55 IST

కృత్విక్‌

నల్లబెల్లి, న్యూస్‌టుడే: ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన బాలుడు మూడేళ్లకే మృత్యువాతపడటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి చెందిన బయ్య దివ్య, వెంకటేశ్‌ దంపతులది ప్రేమ వివాహం. నాలుగేళ్ల క్రితం వారు పెళ్లిచేసుకున్నారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఏడాదికే బాలుడు కృత్విక్‌(3), నాని ఇద్దరు సంతానం కలిగారు. కృత్విక్‌ ఉదయం తోటివారితో కలిసి ఆడుకుంటూ సమీప ఎర్రకుంట వైపునకు పోయాడు. కుంటలో బాతులు కనిపించడంతో వాటిని అదిలిస్తూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు. వారి ఇంటికి సమీపంలోనే అమ్మమ్మ, నానమ్మ వాళ్ల ఇళ్లు ఉండటంతో అక్కడకు పోయి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. చాలాసేపటివరకు ఇంటికి రాకపోవడంతో గాబరా పడ్డారు. కాలనీవాసులంతా కలిసి బావులు, నీటి తొట్టెల్లో వెతికినా ఫలితం లేకుండా పోయింది. చివరకు కాలనీ సమీపంలోని ఉన్న ఎర్రకుంటలో దిగి వెతికే క్రమంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికుల రోదనలు మిన్నంటాయి. కొడుకు బుడిబుడి అడుగులు, బుల్లి బుల్లి మాటలతో సంతోషంగా ఉన్న ఆ ఇంట విషాదం చోటుచేసుకుంది. మూడేళ్లకే నూరేళ్లు నిండాయా.. అంటూ తల్లిదండ్రులు రోదించడం చూపరులను కలిచి వేసింది. ముద్దుగా ఉండే చిన్నారి విగతజీవిగా పడి ఉండటం చూసి స్థానికులు కంట తడి పెట్టారు. 

బాలుడిని మింగిన కుంట
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని