logo

ముఖ్యమంత్రి దృష్టికి జిల్లా సమస్యలు

జిల్లాలోని తెరాస కార్యకర్తలు, నాయకులు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అధిష్ఠానం ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమిస్తే వారినే గెలిపించి ములుగు జిల్లాలో గులాబీ జెండా

Published : 21 May 2022 01:50 IST

ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ సారయ్య, చిత్రంలో జడ్పీఛైర్మన్‌ జగదీశ్వర్‌

వెంకటాపూర్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని తెరాస కార్యకర్తలు, నాయకులు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అధిష్ఠానం ఎవరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమిస్తే వారినే గెలిపించి ములుగు జిల్లాలో గులాబీ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో తెరాస జిల్లా అధ్యక్షుడు, జడ్పీఛైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని ముఖ్యమైన సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి దళిత బంధు పథకం వర్తించేలా చూస్తామని హామీ ఇచ్చారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి, జిల్లా నాయకులు గోవింద్‌నాయక్‌, మల్క రమేష్‌, బాదం ప్రవీణ్‌, ఎంపీపీ బుర్ర రజిత, జడ్పీటీసీ సభ్యురాలు గై రుద్రమదేవి, వేణు, సాయికుమార్‌, రమేష్‌, సునిల్‌కుమార్‌, లక్ష్మీనారాయణ, సమ్మయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని