logo

ధాన్యంలో కోతలు విధించొద్దు

మిల్లుల్లో ధాన్యం కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్‌ శశాంక అన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌ శివారు అనంతారంలోని పీఏసీఎస్‌

Published : 21 May 2022 01:50 IST

మార్కెట్‌లో రిజిస్టర్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్‌ శశాంక

మహబూబాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే: మిల్లుల్లో ధాన్యం కోతలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్‌ శశాంక అన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌ శివారు అనంతారంలోని పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసేందుకు లారీలు, ట్రాక్టర్లు అధికారులే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెట్‌లో నిల్వ ఉన్నధాన్యం, రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, డీఎం. మహేందర్‌, నారాయణరెడ్డి, మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి, ఏఈవో పూజిత, సీవో ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.

నర్సింగ్‌ కళాశాల పనుల పరిశీలన

మహబూబాబాద్‌: జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నర్సింగ్‌ కళాశాల పనులను కలెక్టర్‌ కె.శశాంక శుక్రవారం పరిశీలించారు. ఈ నెల చివరి నాటికి సివిల్‌ పనులను పూర్తి చేయాలన్నారు. మిషన్‌ భగీరథ నీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రహదారులు, భవనాల శాఖ ఈఈ తానేశ్వర్‌, ఏఈ సందీప్‌, డీఈసీ కంపెనీ మేనేజర్‌ సంపూర్ణరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని