logo

మూడో కోవ.. ధ్యానం బాట

కరోనా మహమ్మారి దెబ్బకు ఆడ మగ వారే కాదు. మూడో కోవకు చెందిన హిజ్రాల్లోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. వరంగల్‌లో ధ్యాన మార్గాన్ని ఎంచుకుని నిత్యం సాధన చేస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు.

Published : 21 May 2022 01:50 IST

వరంగల్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు

ఈనాడు, వరంగల్‌

కరోనా మహమ్మారి దెబ్బకు ఆడ మగ వారే కాదు. మూడో కోవకు చెందిన హిజ్రాల్లోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. వరంగల్‌లో ధ్యాన మార్గాన్ని ఎంచుకుని నిత్యం సాధన చేస్తూ సత్ఫలితాలు పొందుతున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి, ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి యోగానే సరైన మార్గమని ఒక బృందంగా ఏర్పడి సాధన చేస్తున్నారు.

* వరంగల్‌ ఎస్‌ఆర్‌ తోటకు చెందిన ట్రాన్స్‌ జెండర్‌ అశ్విని 2012 నుంచి కొన్నేళ్లపాటు ధ్యాన సాధన చేశారు. తర్వాత వదిలేశారు. గతేడాది కొవిడ్‌ సమయంలో తీవ్ర అస్వస్థతకు గురై కోలుకున్నాక హనుమకొండకు చెందిన ధ్యాన గురువు కిషన్‌రెడ్డి సూచన మేరకు ధ్యానాన్ని మళ్లీ ప్రారంభించి పూర్తిగా కోలుకున్నారు. మరో 11 మంది తోటి హిజ్రాలకు సైతం తన ఇంట్లో ధ్యానం నేర్పించారు. వీరంతా ఉదయం, సాయంత్రం సుమారు గంటపాటు సాధన చేస్తున్నారు. ఒక యోగి ఆత్మ కథ లాంటి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం అలవర్చుకుంటున్నారు. ధ్యాన సాధన, ఆధ్యాత్మికత వల్ల తమకు ఒత్తిడి తగ్గుతోందని, రక్తపోటు లాంటి వ్యాధులు కూడా అదుపులో ఉంటున్నాయని, తామంతా మాంసాహారం కూడా మానేశామని ఇక్కడకు వచ్చే హిజ్రాల రాష్ట్ర అధ్యక్షురాలు లైలా తెలిపారు.

ఉపాధి దిశగా అడుగులు..

వరంగల్‌లో హిజ్రాలకు ఉపాధి చూపించాలనే లక్ష్యంతో మహానగర పాలక సంస్థ వారికి అవగాహన కల్పిస్తోంది. గతంలో సిరి ఔషధాల దుకాణం పెట్టుకున్నారు. మరికొందరు నర్సరీల పెంపకంలో శిక్షణ పొందారు. కొందరు మరుగుదొడ్లు నిర్వహిస్తూ ఆర్జిస్తున్నారు. నగరంలో హిజ్రాలతో 12 స్వయం సహాయక గ్రూపులు కూడా ఏర్పాటయ్యాయి. వారిలో సగానికి సగం గ్రూపుల వారు రుణం పొంది చిరువ్యాపారాలు చేస్తున్నారు. పని ఒత్తిడి తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండేందుకు ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని