logo

రూ.60 లక్షలతో వ్యాపారి పరారీ?

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఓ ఎరువుల వ్యాపారి రూ.60 లక్షలతో పరారు కావడం చర్చనీయాంశంగా మారింది. భీమదేవరపల్లి మండలానికి చెందిన సదరు వ్యాపారి ఎల్కతుర్తిలో

Published : 21 May 2022 01:50 IST

ఎల్కతుర్తి, న్యూస్‌టుడే: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఓ ఎరువుల వ్యాపారి రూ.60 లక్షలతో పరారు కావడం చర్చనీయాంశంగా మారింది. భీమదేవరపల్లి మండలానికి చెందిన సదరు వ్యాపారి ఎల్కతుర్తిలో పదేళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నారు. పలువురు రైతులు ఈయనే వద్దనే ఎరువులు, పురుగు మందులను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారితో చనువుగా ఉంటూ వడ్డీ ఇస్తానంటూ నమ్మబలికాడు. అలా అయిదేళ్ల కాలంలో ఒక్కో రైతు నుంచి రూ.లక్ష నుంచి ఆరు లక్షల వరకు సుమారు 25 మంది వద్ద వడ్డీలకు తీసుకున్నాడు. కొంత మందికి ఏడాదికోసారి వడ్డీ చెల్లిస్తూ నమ్మించాడు. వానాకాలం సీజన్‌ ప్రారంభమవుతున్న తరుణంలో 20 రోజులుగా దుకాణం మూసేశాడు. అతడి కోసర ఆరా తీయగా ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుండటంతో రైతులు దుకాణం వద్దకు వచ్చిపోతూ ఆందోళన చెందుతున్నారు. సదరు వ్యాపారి ఆరునెలలుగా హసన్‌పర్తి మండలం ఎర్రగట్టుగట్ట సమీపంలో అద్దెకు ఉంటూ ఎల్కతుర్తిలో వ్యాపారం చేస్తున్నాడు. రెండు నెలల కిందట తన ప్లాట్‌ను విక్రయించగా రూ.20 లక్షలు వచ్చినా తమకు ఇవ్వలేదని బాధితులు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని