Telangana News: అత్యంత నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమం అందాలి: రేవంత్‌రెడ్డి

వరంగల్‌ డిక్లరేషన్‌ ద్వారా రైతులను ఏ విధంగా ఆదుకుంటామో చెబుతున్నామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. రైతు సమస్యలపై చర్చించడంతోపాటు వాటికి పరిష్కారాలు చూపిస్తున్నామని తెలిపారు.

Published : 22 May 2022 01:54 IST

ఆత్మకూరు: వరంగల్‌ డిక్లరేషన్‌ ద్వారా రైతులను ఏ విధంగా ఆదుకుంటామో చెబుతున్నామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. రైతు సమస్యలపై చర్చించడంతోపాటు వాటికి పరిష్కారాలు చూపిస్తున్నామని తెలిపారు. వరంగల్‌ జిల్లాలోని ఆత్మకూరు మండలం అక్కంపేటలో కాంగ్రెస్‌ రచ్చబండ కార్యక్రమం నిర్వహించింది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ స్వగ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి స్థానిక నేతలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందు జయశంకర్‌ విగ్రహానికి రేవంత్‌ నివాళులర్పించారు. అనంతరం రేవంత్‌ మాట్లాడుతూ.. అత్యంత నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమం అందాలన్నారు. కేసీఆర్‌ చెప్పినట్లు ఎక్కడా మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదని తెలిపారు. కొందరికి రెండు పడక గదుల ఇల్లు కాదు కదా.. పూరి గుడిసే కూడా రాలేదని ఆక్షేపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు